close

తాజా వార్తలు

Published : 04/01/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపాది హత్యారాజకీయం: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైకాపాది హత్యారాజకీయం అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లు సర్పంచిగా పని చేసిన వ్యక్తిని హత్య చేయడం కిరాతక చర్య అని ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో 16 మంది తెదేపా కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారన్నారు.

ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, దాచేపల్లిలో అంకులు హత్యలు.. వైకాపా హత్యా రాజకీయాలకు నిదర్శనాలు అని చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయిందన్న ఆయన.. సీఎం జగన్‌ అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైకాపా నాయకులు శాంతి భద్రతలను అధ:పాతాళానికి దిగజార్చారని విమర్శించారు. మాజీ సర్పంచి పురంశెట్టి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి(55)ని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చారు. నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
ఫోన్‌ చేసి పిలిచి.. తెదేపా నేత హత్య

కడప కేంద్ర కారాగారానికి బీటెక్‌ రవి



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని