close

తాజా వార్తలు

Published : 12/08/2020 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈవ్‌టీజింగ్‌ మా అమ్మాయి ప్రాణం తీసింది

యూపీ సీబీఎస్‌సీ ర్యాంకర్ కుటుంబ సభ్యుల ఆరోపణ

బులంద్‌శహర్‌: ఎన్ని అవాంతరాలు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలించింది. కానీ, ఇంతలో కరోనా కారణంగా స్వదేశానికి రావడమే తన పాలిట శాపమైంది. ఇద్దరు కుర్రాళ్ల ఆకతాయితనం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబం ఆమెపై పెట్టుకున్న కలలను కల్లలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌శహర్‌కు చెందిన సుదీక్షా భాటి(20) చదువుల్లో మేటి. 2018లో 12వ తరగతి సీబీఎస్‌సీ పరీక్షల్లో 98 శాతం మార్కులు సాధించింది. తన ప్రతిభకు మెచ్చి హ్యుమానిటీస్‌ విభాగంలో మసాచుసెట్స్‌లోని బాబ్సన్‌ కళాశాల పూర్తి స్థాయి స్కాలర్షిప్‌ను అందించింది. అప్పటినుంచి అక్కడే తన చదువును కొనసాగిస్తోన్న ఆమె..వైరస్‌ విజృంభణ కారణంగా అమెరికా నుంచి సొంతూరుకు చేరుకుంది. పరిస్థితులు చక్కబడితే ఆగస్టులో తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతోంది. కానీ, ఇంతలోనే ఆ కుటుంబంలో ఈవ్‌టీజింగ్ కడుపుకోత మిగిల్చింది.  

తాను చదువుకున్న పాఠశాల నుంచి అవసరమైన కొన్ని కాగితాలు తెచ్చుకోడానికి బంధువుతో కలిసి ద్విచక్రవాహనం మీద బయలుదేరింది. అటుగా మరో బండి మీద వస్తోన్న ఇద్దరు వ్యక్తులు వీరి వాహనాన్ని ఇష్టం వచ్చినట్లు ఢీకొంటూ.. ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. ‘ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా బండిని నడుపుతూ మమ్మల్ని ఢీకొట్టారు. ఇష్టం వచ్చినట్లు తన మీద వ్యాఖ్యలు చేశారు. వాహనంతో మా ముందు స్టంట్లు చేశారు. దాంతో మేం వేగం తగ్గించగా, ఒక్కసారిగా వేరే వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరం కిందపడిపోయాం. కానీ ఆమె తలకు బలంగా దెబ్బలు తగిలాయి. అనంతరం బండి నడిపేవ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో ఆ వ్యక్తిని చూడలేకపోయాను’ అని సుదీక్ష అంకుల్ సాతేందర్ భాటి వెల్లడించారు. 

దీనిపై యూపీ మాజీ మఖ్యమంత్రి మాయావతి స్పందిస్తూ..‘తెలివైన విద్యార్థిని ఈవ్‌టీజింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధారకరం. ఇది తీవ్రంగా ఖండిచాల్సిన విషయం. ఇలాగైతే ఆడపిల్లలు ఎలా ముందుకెళ్తారు. వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

కాగా, ఈవ్‌టీజింగ్ ఆరోపణలను బులంద్‌శహర్ పోలీసులు కొట్టిపారేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘ట్రాఫిక్ కారణంగా ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వీరి బండిని అటుగా వెళ్తోన్న వేరే వాహనం ఢీకొందని కొందరు ప్రతక్ష్య సాక్షులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బంధువు, ప్రత్యక్ష సాక్షులు ఎవరూ ఈవ్‌టీజింగ్ గురించి మాట్లాడలేదు’ అని బులంద్‌శహర్ పోలీసు ఉన్నతాధికారి అతుల్ శ్రీవాస్తవ వెల్లడించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.