Cinema News: ‘సన్న’జాజుల్లా మారి...!
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 10:13 IST

Cinema News: ‘సన్న’జాజుల్లా మారి...!

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఇది ఎంతకాలం ఉంటే అంత బాగా కెరీర్‌ పరుగులు తీస్తుంది. కెరీర్‌ ఆరంభంలో ‘సన్న’జాజిలా నాజూకుగా ఉన్న భామలు కొందరు తర్వాత బొద్దుగా మారిపోయారు. కొంతకాలానికి తీవ్రమైన   కసరత్తులు చేసి మళ్లీ మెరుపుతీగలా మారుతున్నారు. క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం తీసుకొంటూ... అందచందాలకు మెరుగులు అద్దుకొంటున్నారు. కీర్తిసురేష్, నిత్యామేనన్, ప్రియాంక జవాల్కర్, సురభి, వరలక్ష్మీశరత్‌కుమార్, అవికాగోర్‌ తదితరులు ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్‌కు ముందు వీరంతా బాగా ఒళ్లు చేశారు. లాక్‌డౌన్‌తో చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇలా దొరికిన విరామాన్ని చక్కగా ఉపయోగించుకొని చూడచక్కగా మారిపోయారు. యోగా, వాకింగ్, జాకింగ్, రన్నింగ్, జిమ్‌లో కసరత్తులు... ఇలా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని అందమైన శిల్పాల్లా మారి పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని