close

తాజా వార్తలు

Published : 21/11/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షాకింగ్‌ బన్నీ లుక్‌.. 45 ఏళ్ల బ్యూటీ

సోషల్‌ లుక్‌: సినీ తారల విశేషాలు

* స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫొటో ఆన్‌లైన్‌లో అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆయన నటిస్తున్న ‘పుష్ప’ సినిమాలోని స్టిల్‌ లీక్‌ అయ్యింది. అందులో బన్నీ పక్కా మాస్‌ లుక్‌లో.. టక్కున గుర్తుపట్టలేని విధంగా కనిపించి, సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన లుక్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తర్వాతి సినిమా ద్వారా అల్లు అర్జున్‌ అందరికీ ట్రీట్‌ ఇవ్వబోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేశారు.

* నటి మీనా దాదాపు 26 ఏళ్ల నాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ‘బొబ్బిలి సింహం’ ముహూర్తం సందర్భంగా బాలకృష్ణ, రజనీకాంత్‌తో కలిసి తీసుకున్న అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. రాజమండ్రిలో తొలి సన్నివేశానికి రజనీ క్లాప్‌ కొట్టారని తెలిపారు.

* అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన సతీమణి నమ్రత సోదరి శిల్పకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమెతో దిగిన ఫొటో షేర్‌ చేశారు. ‘మీ జీవితం సంతోషం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

* బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. నాన్న పర్‌ఫెక్ట్‌ ఛాయ్‌ టైమ్‌ ఫొటో తీశారంటూ ఫొటో షేర్‌ చేశారు.

* నటి సుస్మితా సేన్‌ 45 ఏళ్ల వయసులోనూ ఎంతో దృఢంగా ఉన్నారు. ఆమె తన పుట్టినరోజు సందర్భంగా కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అభిమానులే తన బలమని, గత 25 ఏళ్లుగా తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
















Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని