
తాజా వార్తలు
అర్హకు బన్నీ సర్ప్రైజ్.. అదాకు ఫిదా..!
సోషల్ లుక్: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు
* తన చిట్టితల్లి అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఇచ్చారు. స్టైలిష్ స్టార్ గుర్రాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు అర్హతో కేక్ కట్ చేయిస్తున్న ఫొటోను కూడా బన్నీ పంచుకున్నారు.
* కథానాయిక తమన్నా నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘11th అవర్’. దీని చిత్రీకరణ పూర్తయిందంటూ ఆమె సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ‘ఈ చిత్ర బృందాన్ని చాలా మిస్ అవబోతున్నా. కరోనా సంక్షోభంలోనూ సెట్లో ఎంతో ఎంజాయ్ చేశాం’ అని పేర్కొన్నారు.
* తన తండ్రి కృష్ణరాజ్ రాయ్‌ను ఐశ్వర్యరాయ్ గుర్తు చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ‘హ్యాపీ బర్త్‌డే డాడ్.. మిస్ యు’ అంటూ అభిషేక్ బచ్చన్ కూడా పోస్ట్ చేశారు.
* కథానాయిక అదా శర్మ మరోసారి తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. కథక్ డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ఫాలోవర్స్ నుంచి మంచి స్పందన లభించింది.
* నటి ప్రణీత మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రంలో సరదాగా సమయం గడుపుతున్న ఫొటోల్ని షేర్ చేశారు.
* నటుడు మంచు విష్ణు ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఆయన ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుని ఉన్నారు. ‘నేను ఎవరితో మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. ఓ హింట్ ఇస్తా.. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరు’ అని పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు ‘ఢీ 2’ కోసం దర్శకుడు శ్రీనువైట్లతో మాట్లాడుతున్నారని కామెంట్లు చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
