
తాజా వార్తలు
కాజల్ పార్టీ క్లిక్స్.. తప్పించుకోలేవు మహేశ్
సోషల్ లుక్: ప్రముఖులు పంచుకున్న విశేషాలు
* ‘నాన్నా.. నువ్వు నా కెమెరా నుంచి తప్పించుకోలేవు..’ అని తన తండ్రి మహేశ్ బాబుకు చెబుతోంది సితార. ఆయన్ బెడ్‌పై పడుకుని నవ్వుతున్న వీడియోను షేర్ చేసింది.
* ఓ సినిమా ఆరంభమైంది.. కానీ నిర్మాణరూపం దాల్చలేదని చెప్పారు అమితాబ్ బచ్చన్. ఆగిపోయిన ఆ సినిమా స్టిల్‌ను షేర్ చేశారు. ‘ఈ చిత్రం తెరకెక్కనేలేదు.. ఫొటోషూట్ జరిగింది, టైటిల్ కూడా పెట్టారు..’ అని పేర్కొన్నారు.
* కాజల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి నెల రోజులైంది. ఆ అపురూప ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె వెడ్డింగ్ పార్టీలో క్లిక్ మనిపించిన చక్కటి ఫొటోల్ని పంచుకున్నారు.
* తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ రాశీ ఖన్నా ధన్యవాదాలు తెలిపారు. ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పర్యావరణాన్ని రక్షించే దిశగా అడుగులు వేయాలని కోరారు.
* విహారయాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన సమంత-నాగచైతన్య హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరిద్దరు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.