
తాజా వార్తలు
చిట్టి చెల్లికి పెళ్లంట.. మహేశ్ లుక్ వైరల్
సోషల్ లుక్: సెలబ్రిటీలు షేర్ చేసిన విశేషాలు
* తమ చిట్టి చెల్లి నిహారిక మరో ఇంటి కోడలు కాబోతోందంటూ చిరంజీవి కుమార్తె శ్రీజ ఫొటోలు పంచుకున్నారు. ఇది వేడుక సమయం అంటూ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి నిహారిక స్పందిస్తూ.. ‘లవ్యూ స్వీటక్కా..’ అని కామెంట్ చేశారు.
* మహేశ్‌బాబు మరోసారి కొత్త లుక్‌లో దర్శనమిచ్చి అలరించారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తీసిన స్టిల్స్‌లో బాగా నచ్చింది ఎంపిక చేయడం కష్టమని, అన్నీ అద్భుతంగా ఉంటాయంటూ మహేశ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో పంచుకున్నారు.
* తన తండ్రి బెల్లకొండ సురేశ్ పుట్టినరోజు సందర్భంగా సాయిశ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన రాక్‌స్టార్ అని పేర్కొన్నారు. లవ్ యూ డాడ్ అంటూ ముద్దుపెడుతున్న ఫొటో పోస్ట్ చేశారు.
* దివంగత నటి జయలలిత వర్ధంతి సందర్భంగా నటి కంగనా రనౌత్ నివాళులర్పించారు. తను నటిస్తున్న ‘తలైవి’ చిత్రం స్టిల్స్‌ను పంచుకున్నారు. ఈ ప్రపంచం నటీమణుల్ని చూసే కోణాన్ని మార్చిన వ్యక్తి ఆమె అని చెప్పారు. ‘తలైవి’లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌తోపాటు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
* తన సినిమా ‘క్రాక్’ సెట్లో తీసిన వీడియోను రవితేజ పంచుకున్నారు. బీచ్పక్కన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న దృశ్యాన్ని ఫాలోవర్స్‌కు చూపించారు. ఇవాళ్టికి ఇది చివరి షాట్ అని పేర్కొన్నారు.