తాడేపల్లిగూడెం: బైక్‌పై కూలిన సెల్‌ టవర్‌
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాడేపల్లిగూడెం: బైక్‌పై కూలిన సెల్‌ టవర్‌

ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు పోలీస్ స్టేషన్‌ కూడలి వద్ద నిరుపయోగంగా ఉన్న సెల్ టవర్ కూలిపోయింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న బొట్టా రాజేశ్‌ (45) అక్కడికక్కడే మృతిచెందగా.. రాణి అనే మహిళకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. క్షతగాత్రురాలిని సమీపంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని