TIMSలో ఆక్సిజన్ కొరత లేదు: కిషన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 25/04/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TIMSలో ఆక్సిజన్ కొరత లేదు: కిషన్‌రెడ్డి

గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.

‘‘సుమారు 600 మంది కరోనా బాధితులు టిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వంద మంది ఐసీయూలో ఉండగా.. 50 మంది సాధారణ చికిత్స తీసుకుంటున్నారు. టిమ్స్‌కు ప్రత్యేకంగా 200 వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇక్కడ వెంటిలేటర్ల సమస్య లేదు. ఆక్సిజన్ కోసం ఎన్‌ఆర్‌బీ పరికరాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే కొంత మేర మాస్కుల కొరత ఉంది. ప్రకృతి విపత్తుల సమయంలో వినియోగించుకునేందుకు రాష్ట్రాల దగ్గర అత్యవసర నిధి ఉంటుంది. నిధుల కొరత ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధిని వాడుకోవాలి. ప్రస్తుతం అవసరమైనంత వరకు కొవిడ్‌ని అరికట్టేందుకు వినియోగించుకోవాలి. టిమ్స్‌లో 700 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఉన్నాయి. దేశంలోని పలు కంపెనీలకు అక్సిజన్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగపూర్, జర్మనీ దేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ నివారణ చర్యల మీద దృష్టి సారించాలి’’ అని కిషన్ రెడ్డి వివరించారు.

కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా మాస్క్ పెట్టుకోకుండా కొంత మంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ల వల్ల కరోనా తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు చేయాల్సినవి, తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని.. ప్రజలు అవగాహన పెంచుకుని ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని