Vaccine: 18+ వారికీ ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌
close

తాజా వార్తలు

Published : 24/05/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: 18+ వారికీ ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌

దిల్లీ: టీకా పంపిణీపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు గల వారు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండానే ప్రభుత్వ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆన్‌సైట్‌ లేదా వాక్‌-ఇన్‌ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్‌ చేసుకుని టీకా వేయించుకునేందుకు వీలు కల్పించింది. టీకా వృథాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. 

‘‘టీకాల కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకున్న లబ్ధిదారులు ఒకవేళ ఆ రోజున రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. అందుకే టీకా వృథాను కొంతలో కొంత తగ్గించేందుకు ప్రభుత్వ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద 18-44 ఏళ్ల వారికి ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, ఇంటర్నెట్‌ సదుపాయం లేనివారికి, మొబైల్‌ ఫోన్స్‌ వాడకం తెలియనివారికి కూడా ఆన్‌సైట్‌ నమోదుకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. 

అయితే దీనిపై తుది నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ 18-44 ఏళ్ల వారికి ఆయా రాష్ట్రాలు ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌కు అనుమతినిస్తే.. అది కేవలం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ప్రయివేటు కేంద్రాల వద్ద వాక్‌-ఇన్‌ నమోదులను చేపట్టొద్దని సూచించింది. అంతేగాక, ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో టీకా కేంద్రాల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. 

మే 1 నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే 18-44 ఏళ్ల వారు కచ్చితంగా కొవిన్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపింది. ప్రస్తుతం ఈ నిబంధనను కాస్త సడలిస్తూ ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద వీరు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే 18ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇవ్వొచ్చని కేంద్రం చెప్పినప్పటికీ.. అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరత కారణంగా వీరికి టీకా పంపిణీ ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని