close

తాజా వార్తలు

Published : 05/12/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగమ్మాయిలపైనే ఆ ముద్ర ఎందుకు?

‘‘నటిగా ఇలాంటి పాత్రలే చేయాలి.. అని నేనెప్పుడూ పరిమితులు పెట్టుకోలేదు. ఓ గిరిగీసుకొని ఏదో రెండు, మూడు పాత్రలకే పరిమితమైతే నటిగా నన్ను నేను ఎలా నిరూపించుకోగలుగుతా? అందుకే అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నా’’ అంది చాందినీ చౌదరి. ఇటీవలే ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ అచ్చ తెలుగు ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘బొంభాట్‌’ అనే మరో చిత్రంతో అందరి ముందుకొచ్చింది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రముఖ ఓటీటీ వేదిక  అమెజాన్‌ ప్రైమ్‌లో గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ వేదికగా మీడియాతో ముచ్చటించింది చాందినీ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

ప్రేమ.. పెళ్లి

‘‘ఒక వ్యక్తిపై ప్రేమ కావొచ్చు.. కెరీర్‌పై ప్రేమ కావొచ్చు.. ప్రేమ  జీవితంలో చాలా ముఖ్యం. మన జీవితాల్ని బ్యాలెన్స్‌గా ముందుకు తీసుకెళ్లేది ప్రేమే. ఇక పెళ్లి విషయానికొస్తే.. పెద్దలు కుదిర్చినదైనా, ప్రేమ పెళ్లయినా మూడు ముళ్లు పడ్డాక అంతా ఒకటే. వ్యక్తిగతంగా నేను ప్రేమ పెళ్లిని ఇష్టపడతా. అలాగని ఇప్పుడేం నేను ప్రేమలో లేను లేండి (నవ్వుతూ).’’ 

నటి కాకపోయి ఉంటే

‘‘నాకు చాలా రంగాల్లో ఆసక్తి ఉంది. ఇంజినీరింగ్‌ చేశాక.. మాస్టర్స్‌ చేసి, పీహెచ్‌డీ చేద్దామనుకున్నా. అంతకు ముందు స్పోర్ట్స్‌లోకి వెళ్లాలనుకున్నా.    త్రోబాల్‌లో స్టేట్‌ ఛాంపియన్‌ని. జిల్లా స్థాయిలో ఖోఖో ఆడా. టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌ బాగా ఆడతా. పెయింటింగ్‌ బాగా వేస్తా. కవితలు, కథలు రాస్తా. ఇలా చాలా వాటిలో నైపుణ్యముంది.

ఊహించలేదు

‘కలర్‌ ఫొటో’ చిత్రం ఇంత చక్కటి ఆదరణ దక్కించుకుంటుందని అసలు ఊహించలేదు. అయితే మొదటి నుంచీ మాకు మంచి చిత్రం చేస్తున్నామన్న నమ్మకం ఉండేది. ఈ చిత్రం ఇప్పుడైనా    ప్రేక్షకుల కోసం థియేటర్లోకి వస్తే బాగుండనిపిస్తోంది.

సైన్స్‌ ఫిక్షన్‌.. ప్రేమకథ

‘‘కథ, కథనాలు, నా పాత్ర పరంగా ‘కలర్‌ఫొటో’కి పూర్తి భిన్నమైన చిత్రం బొంభాట్‌. ఓ సరికొత్త సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో రూపొందింది. దీంతో పాటు మంచి ప్రేమకథతోనూ మిళితమై ఉంటుంది. నేనిందులో చైత్ర అనే  మోడ్రన్‌ అమ్మాయిగా కనిపిస్తా.’’

తెలుగమ్మాయిలకేం తక్కువ?

‘‘తెలుగమ్మాయిలు అన్ని రకాల పాత్రలు పోషించలేరు.. చాలా పరిమితులుంటాయి’ అని దర్శక నిర్మాతల్లో మొదటి నుంచీ ఓ అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. నిజానికి బయట భాషల నుంచి వచ్చే నాయికల్లోనూ ఎక్స్‌పోజింగ్‌కి, మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకోవడానికి ‘నో’ చెప్పే వాళ్లున్నారు. ఆ ముద్ర తెలుగమ్మాయిలకే ఎందుకు ఆపాదిస్తారన్నది  నాకిప్పటికీ అర్థం కాదు. అందం.. అభినయం.. ఇలా ఏ   రకంగా చూసినా ఇప్పుడొస్తున్న తెలుగమ్మాయిలు బయట నాయికలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఏ పాత్రలు పోషించడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. దీనికి నేనే ఉదాహరణ. నేను ‘మస్తీస్‌’ అనే వెబ్‌సిరీస్‌ చేశా. అందులో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది. వృత్తిపరంగా నేను తెరపై ఎలా కనిపించినా.. బయట మాత్రం సంప్రదాయబద్దంగానే ఉంటా.

అదే తొలి ప్రేమ లేఖ

‘‘నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశా. మా క్లాస్‌ మొత్తంలో   నేనొక్కదాన్నే అమ్మాయిని. టామ్‌ బాయ్‌లా ఉండేదాన్ని. మా బ్రాంచి అబ్బాయిలు పక్క బ్రాంచిల్లోని అమ్మాయిలకు ట్రై చేయడానికి నా సహాయమే తీసుకునేవాళ్లు. ఓ సారి నా ఫ్రెండ్‌కి అలాంటి సహాయమే చేస్తే.. నాకు థ్యాంక్స్‌ చెబుతూ ఓ లెటర్‌ రాసిచ్చి, ఇదే ప్రేమ లేఖ అనుకో అన్నాడు.

 

ఇవీ చదవండి
ఇంతమందిని నవ్వించినందుకా మాకీ శిక్ష

నేనూ ఆ వివక్ష ఎదుర్కొన్నా!


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని