ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు 71 ఏళ్లు పూర్తి చేసుకుని 72వ ఏట అడుగు పెట్టారని నేతలు వెల్లడించారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు ఆకాంక్షించారు. విభజన గాయాలతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఏర్పాటైన రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, అశోక్‌బాబు, అధికార ప్రతినిధి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

విజయవాడలో..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ నాగుల్‌ మీరా పాల్గొని కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

విశాఖపట్నం, అనంతపురంలో..

నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను చూసిన వ్యక్తి చంద్రబాబు అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొనియాడారు. విశాఖలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బాబు మళ్లీ సీఎం కావాలన్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు శ్రేణులతో కలిసి అనంతపురంలో వేడుకలు నిర్వహించారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని