హక్కు కల్పించమంటే భౌతికదాడులా?: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హక్కు కల్పించమంటే భౌతికదాడులా?: చంద్రబాబు

తుళ్లూరు: తమ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులతో మార్చుకోలేని ఒప్పందం చేశామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. అలా ఒప్పందం చేసిన తర్వాతే రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు దీక్షా శిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన భూములపై  హక్కు కల్పించాలని కోరితే రైతులపై భౌతిక దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. అమరావతిలో ఒకే కులం అంటూ దుష్ప్రచారం చేశారని వైకాపా నేతలపై మండిపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి బయల్దేరిన అమరావతి మహిళా రైతులను పోలీసులు నిర్బంధించే క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని