‘వైకాపా పాలనలో కార్మికులు రోడ్డునపడ్డారు’
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైకాపా పాలనలో కార్మికులు రోడ్డునపడ్డారు’

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెదేపా ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఆయన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మేం అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న బీమాతో 2.50 కోట్ల మంది కార్మికులకు భరోసా కల్పించాం. కార్మికులు ఆకలిలో ఉండకూడదని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశాం. వందల పరిశ్రమలు నెలకొల్పి లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఆనాటి కార్మిక సంక్షేమ పథకాలు ఏవీ ఇప్పుడు లేవు. వైకాపా అనాలోచిత విధానాలతో కార్మికులు రోడ్డునపడ్డారు. కరోనా సమయంలో కార్మికులకు టీకా, మందులు ఉచితంగా ఇవ్వాలి’’ అని చంద్రబాబు అన్నారు.

శ్రామికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌.. ‘‘అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని తెలియజెప్పిన రోజు మేడే. త్యాగాలు, పోరాటాలతో విశాఖ ఉక్కును ప్రజలు సాధించుకున్నారు. విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే ప్రయత్నాన్ని ఆపాలి. ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టి ఉపాధి కల్పించాలి’’ అని ట్వీట్‌ చేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని