ఇది ముమ్మాటికీ కక్షసాధింపే: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 13/03/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది ముమ్మాటికీ కక్షసాధింపే: చంద్రబాబు

అమరావతి: సంబంధం లేని అంశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని మండిపడ్డారు. తెదేపా నేతలపై ఇవి ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలేనని.. వైకాపా వికృత రాజకీయాలతో ప్రజలను భయపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలతో నిరూపించిన వారిపై కక్షసాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నల్లమిల్లిని కాకినాడు సబ్‌జైలుకు తరలించారు. రామకృష్ణారెడ్డి అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని