ఒక్క అవకాశమంటే ట్రాప్‌లో పడ్డారు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క అవకాశమంటే ట్రాప్‌లో పడ్డారు: చంద్రబాబు

ఇప్పుడు నోట్లతో మాయ చేస్తారు
ప్రజలంతా వైకాపాకు బుద్ధి చెప్పాలని తెదేపా అధినేత పిలుపు

విజయవాడ: కరోనా సమయంలో ప్రజల ఆదాయం పెరగకపోయినా.. సీఎం జగన్‌ అక్రమార్జన పెరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్టినగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చేసిన మంచిని ప్రజలు మర్చిపోయారని.. ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్‌ అడిగితే ప్రజలంతా ఆయన ట్రాప్‌లో పడి మోసపోయారన్నారు. అప్పుడు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. 

వారికి పాప భీతి లేదు..

తెదేపా హయాంలో చేసిన పనులన్నీ కొట్టుకుపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్య, పెళ్లికానుక, చంద్రన్న బీమా, పండుగల సమయంలో ఇచ్చే కానుకలు, నిరుద్యోగభృతి, అన్న క్యాంటీన్లు పోయాయని గుర్తు చేశారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నోట్లు ఇస్తారన్నారు. అప్పుడు ముద్దులతో మాయ చేశారని.. ఇప్పుడు నోట్లతో మాయ చేస్తారని వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఇళ్లకు పొక్లెయిన్‌ పంపి విధ్వంసం సృష్టిస్తారని ఆరోపించారు. రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడిన వారికి పాప భీతి లేదని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి అన్నారు.

వైకాపాకు ఓటేస్తే మూడు రాజధానులకు మద్దతిచ్చినట్లే..

చైతన్యానికి మారుపేరు విజయవాడ అని.. ఎన్నో ఉద్యమాలను ఈ నగరం నడిపిందని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికల ముందు వరకూ చెప్పి ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారని జగన్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీకు ఆమోదయోగ్యమా? అని ప్రజల్ని ప్రశ్నించారు. వైకాపాకు ఓటు వేస్తే మూడు రాజధానులకు మద్దతు తెలిపినట్లవుతుందని హెచ్చరించారు. రూ.6లక్షల కోట్లంటూ తనపై అవినీతి ఆరోపణలు చేశారని.. 6 పైసలు కూడా నిరూపించకలేకపోయారన్నారు. అదీ తన విశ్వసనీయతని చెప్పారు. జగన్‌ ఏబీసీడీ పాలసీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని