వివేకా హత్య కేసు నిందితులను వదలం: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 11/04/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివేకా హత్య కేసు నిందితులను వదలం: చంద్రబాబు

సూళ్లూరుపేట: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మందులు లేక వైద్యం పడకేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సూళ్లూరుపేట బస్టాండు కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల ప్రచారంలో పాల్గొన్నారు. 2029 నాటికి ఏపీని నంబర్‌వన్‌ రాష్ట్రం చేయాలని విజన్‌ తయారు చేసినట్లు చెప్పారు. తాను తీసుకొచ్చిన జినోమ్‌ వ్యాలీలోనే కరోనా వ్యాక్సిన్ల తయారీ కొనసాగుతోందన్నారు.

కరోనా వేళ వైకాపా ప్రభుత్వం ప్రజలను ఆదుకుందా? నిత్యావసరాల ధరలు పంచుతారా? మద్యం దుకాణాలు ఎలా తెరుస్తారని చంద్రబాబు నిలదీశారు. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలని కూడా సీఎంకు తెలియదని విమర్శించారు. పరిపాలన పక్కనపెట్టి మరీ కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయి హంతకులను కాపాడే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. వివేకా హత్య కేసు నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. లోకేశ్‌ సవాలు చేస్తే జగన్‌ భయపడి తోకముడిచారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ఇసుక, మద్యం విషయంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని