సంతోష్‌ బాబు కుటుంబానికి చంద్రబాబు ఫోన్‌
close

తాజా వార్తలు

Updated : 21/06/2020 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంతోష్‌ బాబు కుటుంబానికి చంద్రబాబు ఫోన్‌

అమరావతి: వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. సంతోష్‌ బాబు తండ్రి ఉపేందర్‌ను చంద్రబాబు పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధన్యజీవి సంతోష్‌బాబు అని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు.

ఇటీవల భారత్‌ - చైనా సరిహద్దులో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన విషయం తెలిసిందే. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల అంతిమ సంస్కారాలు జరిగాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని