రాజధాని రైతులకు అండగా ఉండాలి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 24/08/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని రైతులకు అండగా ఉండాలి: చంద్రబాబు

అమరావతి: అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదుగా జరిగాయన్నారు. ఆందోళనకారుల బాధ వినడానికి కూడా ముందుకు రాని పాలకులు కూడా అరుదేనని వ్యాఖ్యానించారు. వేలాది మంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని విమర్శించారు. ఉద్యమంలో 85 మంది రైతు కూలీలు, రైతులు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని ఆరోపించారు.

 అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న తెలుగుదేశం డిమాండ్‌కు వైకాపా ముందుకు రాలేదంటే.. మూడు రాజధానుల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టే నన్నారు. అమరావతి శంకుస్థాపనకు 13వేల గ్రామాల నుంచి పవిత్ర మట్టి, పుణ్య జలాలు తెచ్చారంటేనే.. అమరావతిని అందరూ రాజధానిగా గుర్తించినట్టు అని తెలిపారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉందన్నారు.

తప్పును సరిదిద్దుకోవాలి: లోకేశ్‌
పాలకుడు మానిప్పుడల్లా రాజధాని మార్చడమేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. వికృత ఆలోచనతో 85 మంది రైతులను బలితీసుకున్నారని సీఎం జగన్‌ తీరుపై ధ్వజమెత్తారు. రాజధాని పోరాటం మొదలై 250 రోజులైందని, ఇప్పటికైనా తప్పు దిద్దుకోవాలని సూచించారు. మూడు రాజధానుల పేరుతో ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ప్రజా ఆమోదంతో ఏర్పాటైన రాజధానిని జగన్‌ ఎందుకు మారుస్తున్నారని నిలదీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని