
తాజా వార్తలు
‘ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేరా?’
తెదేపా అధినేత చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చగలగాలి... కానీ, వైకాపా పాలనలో ప్రజలు తాము ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యే సరికి నాలుగురోజులు హడావుడి చేసి వదిలేశారని ఆరోపించారు. అదిప్పుడు జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లికి పాకిందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజలు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. పాలకులు కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ ప్రజారోగ్యం మీద పెట్టాలని చంద్రబాబు హితవు పలికారు.
కొమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని కారణాలతో 24మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి..
అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత
వైకాపా అరాచకాలపై పోరాడుదాం: పవన్