
తాజా వార్తలు
విచారణ పేరుతో వేధింపులా?: చంద్రబాబు
పేర్ని నానిపై దాడికి, తెదేపాకి సంబంధం ఏంటి?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన చంద్రబాబు
అమరావతి: మంత్రి పేర్ని నానిపై దాడి కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణల పేరుతో కొల్లు రవీంద్రను ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. మంత్రిపై దాడి ఘటనను తెదేపా తీవ్రంగా ఖండించిందని తెలిపారు. తెదేపా వారే చేయించారంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
పేర్ని నానిపై దాడికి, తెదేపాకి సంబంధం ఏమిటని? చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై ఇంత కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని విచారిస్తే ఎవరు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతంలో కుటుంబ కలహాలతో జరిగిన హత్యలో కొల్లు రవీంద్రను అరెస్టు చేశారన్న చంద్రబాబు.. అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలనుకోవడం సరికాదని హితవు పలికారు. వైకాపా దిగజారుడు రాజకీయాలకు ప్రయత్నిస్తోందని, మితిమీరి వ్యవహరిస్తే తగిన గుణపాఠం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
