
తాజా వార్తలు
రైతుకు ఏమిటీ కష్టం?: చంద్రబాబు
అమరావతి: భోగి మంటలు వెలగాల్సిన కూడళ్లలో అన్నదాతల గుండె మంటలు కనిపిస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా దేవరకొండలో రైతులు అమ్ముకోవడానికి తెచ్చిన టమోటా ధర కిలో 30 పైసలకు పడిపోయిందని మండిపడ్డారు. కనీసం రవాణా కర్చులు కూడా దక్కని పరిస్థితుల్లో రైతుల ఆవేదన ఇది అంటూ అందుకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్‌కు జత చేశారు. సంక్రాంతి వేళ రైతుకు ఏమిటీ కష్టమని నిలదీసిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి..
ఆరుగాలం శ్రమించి పండించిన టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డు పక్కన పడేశారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి అడవిలో సోమవారం దాదాపు 4,200 కిలోల టమోటాలను ఆవులకు పడేసి వెళ్లారు. పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మినా రవాణా ఖర్చులు కూడా చేతికి అందేలా లేవని వాపోయారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి...
తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కొవిడ్ టీకా