ప్రతీకారేచ్ఛతో జగన్‌ రగిలిపోతున్నారు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతీకారేచ్ఛతో జగన్‌ రగిలిపోతున్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌ : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిల అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై తెదేపా చేస్తున్న పోరాటాలను జగన్‌ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలపై జనాల దృష్టి మరల్చేందుకే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

‘జగన్‌ జైలుకెళ్లారన్న కక్షతోనే తెదేపా నేతలను జైళ్లకు పంపిస్తున్నారు. తెదేపా నేతలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కక్షసాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిలను అరెస్టు చేశారు. రెట్టించిన బలంతో ప్రజాసమస్యలపై పోరాడతాం. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. వైకాపా ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడతాం’ అని చంద్రబాబు అన్నారు.  తెదేపా నేతల అరెస్టులను నారా లోకేశ్‌ కూడా ఖండించారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
నేతల అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తెదేపా పిలుపునిచ్చింది. కరోనా నేపథ్యంలో నివాసాల్లోనే తెదేపా నేతలు నిరసనలు తెలపనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని