close

తాజా వార్తలు

Updated : 26/01/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజ్యాంగానికి రక్షణ ఏది?: చంద్రబాబు

అమరావతి: నేరస్థులు ముఖ్యమంత్రి అయి..న్యాయవ్యవస్థపైనే దాడిచేసే పరిస్థితికి వచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  నేరస్థులు కోర్టులనే బెదిరించే పరిస్థితి వచ్చేసిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే ముఖ్యమంత్రి అయితే హైకోర్టు తీర్పు చూసైనా పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేవారు కాదని ఎద్దేవా చేశారు. న్యాయమూర్తులు మారినా న్యాయం మారదని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ఉద్యోగులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ముఖ్యమంత్రే బాధ్యుడన్నారు. వాళ్లకు రావాల్సిన హక్కులపై పోరాడకుండా రాజకీయాలతో ఉద్యోగులకు పనేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యతిరేక పాలన జరిగితే పరిరక్షణ బాధ్యత గవర్నర్‌ తీసుకోవాలన్నారు.

 ఎన్నో ఉల్లంఘనలు జరుగుతున్నా మౌనంగా ఉంటూ గవర్నర్‌ విఫలమవుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవాళ్లు దుష్టులైతే చేదు ఫలితాలే వస్తాయని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. జగన్‌ లాంటి వాళ్ల పాలన ఎంత చేటో రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే గ్రహించారన్నారు. 20 నెలలుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నరకయాతన అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం లేదని.. రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే ఉందని ధ్వజమెత్తారు. పులివెందులలో ఇప్పటికే మాట్లాడే స్వేచ్ఛలేదన్నారు. ఒక ఎమ్మెల్సీని రన్‌వే మీదకు వెళ్లి అరెస్టు చేయడమేంటని  నిలదీశారు. ప్రభుత్వ అవమానాలు భరించలేకనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో తిరుగుబాటు చూసే కళా వెంకట్రావు అరెస్టులో వెనక్కు తగ్గారని విమర్శించారు. భోజనం చేస్తున్న వ్యక్తిని బలవంతంగా స్టేషన్‌కి లాక్కెళ్లి అరెస్టు కాదు.. నోటీసు అని మాటమార్చారని మండిపడ్డారు. బోధనా రుసుముల కోసం విద్యార్థులు సీఎం ఇంటి వద్ద ఆందోళన చేస్తే అత్యాచారయత్నం కేసు పెట్టారని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ చర్యలు

మోదీ తలపాగా.. బహూకరించిందెవరంటే?
Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని