దొంగ ఓట్లు అడ్డుకోవాలి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 10/04/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దొంగ ఓట్లు అడ్డుకోవాలి: చంద్రబాబు

నెల్లూరు: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 5లక్షల మెజార్టీతో గెలుపొందుతామని ప్రకటించిన వైకాపాకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విమర్శించారు. నెల్లూరు అనిల్‌ గార్డెన్స్‌లో స్థానిక కార్యకర్తలతో నిర్వహించిన తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నీ చేస్తున్నట్టు సీఎం జగన్‌ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. తాము కరపత్రాలు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు చేస్తున్నారని, ఎన్నికేసులు పెట్టిన భయపడబోమని వెల్లడించారు. పరిషత్‌ ఎన్నికలు బహిష్కరించడం బాధాకరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కార్యకర్తలకు వివరించారు. ‘‘తిరుపతి ఉప ఎన్నిక తెదేపా కార్యకర్తలకు ఆయుధం. కార్యకర్తలు భయపడవద్దు.. దొంగ ఓట్లు అడ్డుకోవాలి. తెదేపాకు కార్యకర్తలే సైన్యం.. విజయం మీ వల్లే సాధ్యం’’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని