ఆ నిర్ణయం నిరాశకు గురిచేసింది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నిర్ణయం నిరాశకు గురిచేసింది: చంద్రబాబు

అమరావతి: చిత్తూరు జిల్లాలోని కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ (రెస్కో) స్వాధీనానికి ఏపీఎస్పీడీసీఎల్‌కు ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. విద్యుత్ అమ్మకం, పంపిణీ, రిటైల్ లైసెన్స్ మినహాయింపులు పొందడంలో విఫలమైందనే కారణాలు చూపుతూ రెస్కోను స్వాధీనం చేసుకునే ఏకపక్ష చర్య సరైంది కాదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆయన లేఖ రాశారు. ఎంతో వెనుకబడిన మారుమూల ప్రాంతమైన కుప్పంలో నూరుశాతం విద్యుదీకరణ లక్ష్యంతో 1981లో రెస్కోను స్థాపించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. దాదాపు 1,22,000 మంది వాటాదారులుగా ఉన్న ఈ సంస్థకు 1,24,000 గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. స్థాపించిన నాటి నుంచి విజయవంతంగా నడుస్తున్న రెస్కోను చిన్న కారణంతో ఏపీఎస్పీడీసీఎల్‌లో విలీనం చేయడం అర్థంలేని చర్య అని ఆక్షేపించారు. కుప్పం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీఈఆర్‌సీ తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో నిరాశకు గురిచేసిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని