close

తాజా వార్తలు

Updated : 04/12/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరావతి పోరాటం వృథాకాదు: చంద్రబాబు

అమరావతి: అమరావతి రైతులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. అసెంబ్లీ నుంచి వెళుతూ మందడం దీక్షా శిబిరం వద్ద ఆగి రైతులను పరామర్శించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రైతులనుద్దేశించి  చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని.. ఎప్పటికైనా న్యాయమే విజయం సాధిస్తుందన్నారు. కొంత మంది పోలీసులు కావాలనే రైతులు, మహిళలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వారిపై న్యాయపరంగా పోరాడతామన్నారు. అమరావతి రైతులు ఏకాకులు కాదని, వారి పోరాటం వృథా కాదన్నారు. అమరావతిని ఇక్కడి నుంచి తరలించడం ఎవరితరం కాదని హెచ్చరించారు. మూడు రాజధానులు అనేది జగన్‌ తుగ్లక్‌ నిర్ణయమని మండిపడ్డారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని