
తాజా వార్తలు
సుప్రీం తీర్పు కనువిప్పు కావాలి: చంద్రబాబు
అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు కనువిప్పు కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సజావుగా పనిచేయనీయకుండా వైకాపా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని.. అలాంటి ప్రతి సందర్భంలోనూ కోర్టులో జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయమని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిష్పాక్షికంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. గతేడాది మార్చిలో చోటుచేసుకున్న విధ్వంసాలు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్ఈసీని కోరారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా.. ఇలా నాలుగు మూల స్తంభాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ఇవీ చదవండి..
ఎన్నికలపై మేం అలా అనలేదు: వెంకట్రామిరెడ్డి
ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ