close

తాజా వార్తలు

Updated : 21/01/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళా వెంకటరావు చేసిన తప్పేంటి?:చంద్రబాబు

మంగళగిరి: రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాంతి భద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా? డీజీపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారు? తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి ఎలా రద్దు చేస్తారు? అని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన 5రోజుల తర్వాత రామతీర్థం వెళ్లా...కళా వెంకటరావు చేసిన తప్పేంటి? అని చంద్రబాబు నిలదీశారు.

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ తెదేపా శ్రేణులంతా రోడ్డెక్కి నిరసన తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఇవాళ ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కళా వెంకటరావు సహా తెదేపా శ్రేణులపై వైకాపా అరాచకాలను ఖండించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాందోళనలు జరపాలని కోరారు. రాష్ట్రంలో పిచ్చోడి పాలన సాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా అరాచకాలకు కళా అరెస్టు పరాకాష్ఠ అని మండిపడ్డారు. 

ఇవీ చదవండి..
కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు

కళా వెంకటరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని