రామతీర్థం కోనేరును పరిశీలించిన చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 02/01/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామతీర్థం కోనేరును పరిశీలించిన చంద్రబాబు

విజయనగరం: విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. పూర్తిగా ఎటు చూసినా రాజకీయ వేడి కనిపిస్తోంది. నాటకీయ పరిణామాల నడుమ తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి బోడికొండపైకి బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు వెంట నేతలు అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తెదేపా శ్రేణులు ఉన్నారు. విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహం ధ్వంసంపై అక్కడి పూజారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇవీ చదవండి..
రామతీర్థం రణరంగం

రామతీర్థంలో రాజకీయ వేడి 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని