తేజస్విని సూసైడ్‌ వార్త కలచివేసింది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 07/02/2021 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తేజస్విని సూసైడ్‌ వార్త కలచివేసింది: చంద్రబాబు

అమరావతి/ ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్‌ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కళాశాల ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తన మనసును ఎంతగానో కలచివేసిందని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఏపీలో బోధనా ఫీజుల చెల్లింపు పథకం ఏమైందని ప్రశ్నించారు. యువత నిరాశతో ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించి.. తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని యువతి బలవన్మరణం
ఫీజు చెల్లింపు బాధలు తాళలేక ఒంగోలులోని గొడుగుపాలెంలో పాపిశెట్టి తేజస్విని (19) శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాగేశ్వరరావు ముఠా కూలీ. ఫీజు రియంబర్స్‌మెంట్‌ సౌకర్యం ఆగిపోవడంతో ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు.శుక్రవారం రూ.35వేలు ఫీజు చెల్లించిన తండ్రి ఇకపై తాను చెల్లించలేనని చెప్పడంతో మనస్తాపానికి గురైన తేజస్విని ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన
మరోవైపు, ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎదుట విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆ కళాశాల అటానమస్‌ హోదాను రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాయి. అనంతరం ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌ రెడ్డి, డీఎస్పీ ప్రసాద్‌లకు వినతి పత్రం అందజేశారు.

ఇవీ చదవండి..

ఎవ్వరు బెదిరించినా భయపడొద్దు:ఎస్‌ఈసీ ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా?

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని