ఏం చేశారని వైకాపాకు ఓటేయాలి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 10/04/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏం చేశారని వైకాపాకు ఓటేయాలి: చంద్రబాబు

పొదలకూరు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడే ధైర్యమే సీఎం జగన్‌కు లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ రెండేళ్లలో ఏం చేశారని వైకాపాకు ఓటేయాలని ప్రశ్నించారు. విభజన చట్టంలోని సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదా? నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

‘‘ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా మద్యంలో కొత్త బ్రాండ్‌లు తెచ్చారు. మద్యపాన నిషేధం అంశంపై సీఎం జగన్‌ నమ్మకద్రోహం చేశారు. నిత్యావసరాలు, పెట్రోలు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫైబర్‌ గ్రిడ్‌ ధర రూ.150 నుంచి రూ.400కు పెంచారు. నాకంటే బాగా చేస్తాడని భావించే ప్రజలు జగన్‌కు ఓటేశారు. ఎవరు బాగా పరిపాలించారో ప్రజలు సావధానంగా ఆలోచించాలి. రేపటి నుంచి ప్రతి విషయంలో పన్నులు వేస్తారు. మేం ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఇప్పుడు దానికి రెక్కలొచ్చాయి. ట్రాక్టర్‌ ఇసుకకు ప్రస్తుతం రూ.5వేలు తీసుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి కార్మికులు ఉపాధి కోల్పోయారు. వైకాపా పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది’’ అని ఆరోపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని