ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది: చంద్రబాబు

శ్రీకాళహస్తి: తిరుపతి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రసంగించారు. వైకాపా రెండేళ్ల పాలనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అరాచకశక్తులను అడ్డుకునే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం తల ధ్వంసం చేసిన 10 రోజుల తర్వాత అక్కడికి వెళ్తే.. తన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు.

ఈ సీఎం ఒక్క సమస్యపైనైనా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై జగన్‌ ఇప్పుడు మాట్లాడుతున్నారని.. హోదా గురించి అడిగేవారు కాకుండా సాధించేవారు కావాలన్నారు. ఒక ఎంపీ స్థానంలో తెదేపా అభ్యర్థి గెలిస్తే పార్టీ బలపడుతుందనే ఆలోచనతో తిరుపతికి రాలేదన్నారు. వైకాపా అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు ఓటు అనే ఆయుధానికి పదును పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని