close

తాజా వార్తలు

Updated : 08/03/2021 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపా రౌడీయిజం నాదగ్గర సాగదు: చంద్రబాబు

గుంటూరు: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్ర పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, విశాఖ, విజయవాడ పర్యటనలో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ప్రజలు ఇంకా చైతన్య వంతులు కావాల్సిన అవసరముందన్నారు. వైకాపా నేతల రౌడీయిజం తన వద్ద సాగదని, పేకాట మంత్రి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు. వారు ఎన్ని మాట్లన్నా ప్రజల కోసమే భరిస్తున్నానని, వైకాపాకు భయపడి కాదని అన్నారు. రాజదాని అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.


రోడ్‌ షోలో స్వల్ప ఉద్రిక్తత

గుంటూరు: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదవ్‌ బజార్లో చంద్రబాబు రోడ్‌షో సాగుతుండగా.. వైకాపా జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా అటువైపుగా వచ్చారు. రోడ్‌ షో మార్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, వైకాపా కార్యకర్తలకు నచ్చజెప్పి పోలీసులు పక్కకు పంపించివేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని