విజయవాడ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం
close

తాజా వార్తలు

Updated : 21/02/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: విజయవాడ నగర తెదేపాలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గాలకు చెందిన నేతలు బహిరంగ విమర్శలు చేశారు. ఈ క్రమంలో నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నేతల పరస్పర విమర్శలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్నారు. 39వ డివిజన్‌ అభ్యర్థిని నిర్ణయించేవరకు వేచిచూడాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని