తిరుమలలో చంద్రబాబుకు ఘన స్వాగతం
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలలో చంద్రబాబుకు ఘన స్వాగతం

తిరుమల: లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకున్నారు. ఈఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు స్వాగతం పలికారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మహిళా  అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవులు, సంధ్యారాణి తదితరులు  చంద్రబాబుతో పాటు ఉన్నారు. నేటి నుంచి ఈనెల 14 వరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని