close

తాజా వార్తలు

‘దిశ’ బిల్లును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

అమరావతి: మహిళల భద్రత గురించి ప్రత్యేక చట్టం తీసుకురావడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘దిశ’ బిల్లుపై ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయనీ.. వాటన్నింటినీ అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న సమస్యల్ని అధిగమించుకుంటూ వాటిని అమలు చేయడం అంతకన్నా ముఖ్యమైందన్నారు. ఈ చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దని తెలిపారు. దోషులు ఎంత గొప్పవారైనా చర్యలు తీసుకొనే పరిస్థితి ఉండాలన్నారు. 

‘దిశ’ బిల్లు కాపీని ఈ రోజే తమకు ఇచ్చారని.. ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదనీ.. ఈ బిల్లులో చేసిన సవరణలు కూడా తాము ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఎంత చొరవతో ఈ బిల్లు తీసుకొచ్చారో దీన్ని అమలు చేయడంలో అదే ఉత్సాహం చూపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వం కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులపై ఎలక్షన్‌ వాచ్‌డాగ్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అఫిడవిట్‌ల ఆధారంగా విశ్లేషించిందని ఈ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రస్తావించారు. ఆ సంస్థ నివేదిక ప్రకారం  21 మంది భాజపా, 16 మంది కాంగ్రెస్‌, ఏడుగురు వైకాపా నేతలు.. ఇంకా కొన్ని పార్టీలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. దీనిపై వైకాపా సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేయగా.. చంద్రబాబు సమాధానం చెబుతూ.. సీఎం జగన్‌పై తాను ఆరోపణలు చేయడంలేదనీ.. వాస్తవాలు చెబుతున్నప్పుడు సరిచేసుకోవాలని చెబుతున్నానన్నారు. చట్టం మనకు చుట్టమైనప్పుడే సమస్యలు వస్తాయనీ.. చట్టాన్ని చట్టంగా అమలుచేస్తే అసలు సమస్యలు ఉండవన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.