close

తాజా వార్తలు

Published : 17/10/2020 20:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అకస్మాత్తుగా అతనెలా చనిపోయాడు? 

‘క్లార్క్‌ హఠాత్తుగా చనిపోయాడు’ అన్నాడు సఫరీ. ‘అయ్యయ్యో! ఎలా?’ అడిగాడు మూన్‌. ‘తెలీదు, భార్యతో కలిసి ఊరెళ్లాడు. వివరాలు తెలీదు’ చెప్పాడు సఫరీ. ‘నల్లగా మొద్దులా ఉంటాడు. ముఖంలో ఎక్కడా మృదుత్వం కనిపించదు. కానీ ఎదుటివాళ్లని విసిగించకుండా ఎంతసేపయినా మాట్లాడగలడు’ అంటూ గుర్తుచేసకున్నాడు మూన్‌. ఇంతకీ అతనెలా చనిపోయాడు? తర్వాత తెలిసిన నమ్మలేని నిజాలేంటి? సోమర్‌సెట్‌ మామ్‌ ఆంగ్ల కథ వెన్నుపోటు అక్టోబరు చతురలో చదవండి!

అందరిలానే అతను రోజూ క్లబ్బుకి వెళ్లి టెన్నిసు ఆడేవాడు. అతని వయసుకు అయితేనేం, హోదాకైతేనేం గౌరవం ఇచ్చి, యువతరం అతనక్కడ ఉన్నంతసేపు తైతక్కలాడేవారు కాదు. ఒకరిద్దరు అలా చేసినా, పక్కనున్న పెద్దలు వారించేవారు. క్రమశిక్షణ అంటే అతనికి అంత ఇష్టం. ఆ కారణంగా సంఘంలో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నాడు. ఏమైతేనేం, ఇలా కనుమరుగవగానే అతన్ని మరిచిపోతారు. సాధారణ ప్రజల ఆరాధనా భావం అంతంత మాత్రమే కదా! 

ఈ ఆలోచన రాగానే విషాదంగా నవ్వుకున్నాడు. జీవితాన్ని అతనొక కష్టమైన లెక్కల పేపరుగా పరిగణించాడు. అన్నీ సాల్వు చేయడం అతి కష్టం. కానీ కుస్తీపట్టి కొన్నిటికైనా ఫలితాన్ని సాధిస్తే, కలిగే ఆనందం చాలు జీవితానికి. రిటైర్మెంట్‌ వయసు వచ్చినా, ముసలితనం ఇంకా దరిదాపులకి కూడా రాలేదు. 

పూర్తి కథ కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.