బాలికపై అత్యాచారం: 12 మంది అరెస్టు
close

తాజా వార్తలు

Published : 21/07/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలికపై అత్యాచారం: 12 మంది అరెస్టు

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో బాలికపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ షిమోషి బాజ్‌పేయీ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడిస్తూ ‘‘ఉద్యోగం పేరిట బాలికను అనిత అనే మహిళ ట్రాప్‌ చేసింది. ఈ కేసుల 13 మందిని నిందితులుగా గుర్తించాం. 12 మందిని అరెస్టు చేసి.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లు, ఒక మైనర్ ఉన్నారు. ఇద్దరు నిందితులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కోరుకొండ స్టేషన్‌లో కేసు నమోదు చేయలేదనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది’’అని ఎస్పీ తెలిపారు.

గత నెల 22న రంపచోడవరం తీసుకెళ్లి ఐదుగురు అత్యాచారం చేశారని రాజమహేంద్రవరం డీఎస్పీ తెలిపారు. ఆటోలో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇంట్లో చెబితే చంపేస్తామని బాలికను వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని