టిక్‌టాక్‌: చైనా ఏమాత్రం అంగీకరించదు
close

తాజా వార్తలు

Updated : 04/08/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌: చైనా ఏమాత్రం అంగీకరించదు

బీజింగ్: టిక్‌టాక్‌ను వాషింగ్టన్‌ దొంగతనంగా హస్తగతం చేసుకునేందుకు చైనా ఎంతమాత్రం అంగీకరించదని మంగళవారం ఆ దేశ మీడియా పేర్కొంది. టిక్‌టాక్‌ యాప్ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్‌ మీద అమెరికా తీసుకువస్తోన్న ఒత్తిడిపై చైనా తగిన విధంగా స్పందించగలదని హెచ్చరించింది. చైనా కంపెనీల పట్ల వాషింగ్టన్ విధానాలు అవకాశవాదంగా ఉన్నాయని.. ఈ తీరుకు తలొగ్గడం లేదా సాంకేతికంగా ప్రమాదకర యుద్ధాల వైపునకు మొగ్గు చూపడం మినహా చైనాకు మరోదారి లేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. ఆ సంస్థను కుట్రపూరితంగా హస్తగతం చేసుకుంటే, తగిన విధంగా స్పందించడానికి చైనా వద్ద అనేక మార్గాలున్నాయని ఘాటుగా స్పందించింది.

కాగా, భద్రతా కారణాలు చూపి టిక్‌టాక్‌ను అమెరికాలో పూర్తిగా నిషేధిస్తామని శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. ఈ క్రమంలో సదరు యాప్‌ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు చర్చలు జరుగుతుండగా..టిక్‌టాక్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించాలని, లేకపోతే మూసివేయాలని హెచ్చరికలు చేస్తూ, ట్రంప్‌ డెడ్‌లైన్ విధించారు. అంతేకాకుండా వాటిని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడంపై తన ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని