close

తాజా వార్తలు

Updated : 11/04/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మా కరోనా టీకాలకు అంత సీన్‌ లేదు!

కుండబద్దలు కొట్టిన చైనా సీడీసీ డైరెక్టర్‌

బీజింగ్‌: చైనా కరోనా నిరోధక టీకాలపై తొలి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశ ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు తక్కువేనని కుండబద్దలు కొట్టారు. దీంతో తమ దేశంలో అభివృద్ధి చేసిన రెండు టీకాలను కలగలిపి.. వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చైనా ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌-సీడీసీ’ గావో ఫూ తెలిపారు.

చైనా వ్యాక్సిన్లకు కరోనా నుంచి కాపాడే సామర్థ్యం అధికంగా లేదు. వీటిని వినయోగించాలా? లేదా? అన్నదానిపై  సమాలోచనలు జరపుతున్నాం’’ అని గావో తెలిపారు. అలాగే పశ్చిమ దేశాల టీకాలపై ఒకప్పుడు అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని ఒప్పుకోక తప్పలేదు. కరోనా టీకాలను తయారు చేయడానికి ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ పద్ధతిని స్వయంగా గావోయే తప్పుబట్టారు. దీనివల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు ఆయనే.. ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలో టీకాలు తయారుచేసే ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చైనా వ్యాక్సిన్లను సంప్రదాయ టీకా ఉత్పత్తి విధానాన్ని ఉపయోగించి తయారుచేశారు.

చైనాకు చెందిన సినోవ్యాక్ రూపొందించిన కరోనా టీకాకు 50.4 శాతం సామర్థ్యం ఉందని బ్రెజిల్‌ తేల్చింది. అదే అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్‌ టీకా సామర్థ్యం 97 శాతం అని రుజువైంది. ఇప్పటి వరకు చైనాలో 34 మిలియన్ల మందికి రెండు డోసుల టీకా అందించారు. మరో 64 మిలియన్ల మందికి ఒక డోసు వేశారు. ఇక టీకా దౌత్యం పేరిట వివిధ దేశాలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించిన చైనా.. ఇప్పటి వరకు కొన్ని కోట్ల డోసులను విదేశాలకు సరఫరా చేసింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని