అందుకే ‘సైరా’లో చరణ్‌ను వద్దన్న చిరు! 
close

తాజా వార్తలు

Published : 24/08/2020 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ‘సైరా’లో చరణ్‌ను వద్దన్న చిరు! 

ఓ చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుకు ముందు.. క్రీస్తు తర్వాత. అదే ఓ సినిమా గురించి అడిగితే? ఇంటర్వెల్‌కు ముందు ఇంటర్వెల్‌ తర్వాత అనాల్సిందే. అందుకే ఇంటర్వెల్‌ సన్నివేశాల్ని పకడ్బందీగా ప్లాన్‌ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. ఇది అన్ని   చిత్రాలకూ వర్తించినా.. స్టార్‌ కథానాయకుల సినిమాలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం విషయంలో అలాంటిదే జరిగింది.

ఇందులో ఇంటర్వెల్‌ బ్యాక్‌డ్రాప్‌ కోసం షేర్‌ఖాన్‌ అనే శక్తిమంతమైన పాత్రను సృష్టించిందట చిత్ర బృందం. ఈ పాత్రకు సినిమాలో ఐదు నిమిషాల నిడివే ఉన్నప్పటికీ.. విరామానికి ముందు వచ్చే ఆ పాత్ర చిత్రానికి అత్యంత కీలకమైనదట. ఆ పాత్ర ఇంటర్వెల్‌ ముందే ‘‘నరసింహారెడ్డి, నీ లాంటివాడు దేశానికి కావాలి’ అంటూ చిరు చేతిలోని కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోతుంది. ఈ చిత్ర స్క్రిప్ట్‌ పూర్తయ్యాక ఈ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌ దత్‌లలో ఎవరినో ఒకర్ని ఎంపిక చేసుకుందామనుకుంది చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల వాళ్లు ఈ ప్రాజెక్టును వదులుకున్నారు.

దీంతో ఓ దశలో ఆ పాత్రను రామ్‌ చరణ్‌తో చేయిస్తే బావుంటుందనే అభిప్రాయానికొచ్చారట దర్శకుడు సురేందర్‌ రెడ్డి. కానీ, తండ్రి కారణంగా తనయుడు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అనే సందేహంతో  చరణ్‌తో ఆ పాత్రను చేయించడానికి ఒప్పుకోలేదట చిరు. అయితే ఇలాంటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కే చిత్రాలకు నిడివి ఎక్కువ ఉంటుందనే విషయం  తెలిసిందే. తొలి దశలోనే నిడివి సమస్యను అదుపులో పెట్టగలిగితే నిర్మాతలకు బడ్జెట్‌ కలిసి వస్తుంటుంది. అందుకే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందే.. స్క్రిప్ట్‌ దశలోనే కత్తెరకు పని చెప్పారట. ఈ క్రమంలోనే ఆ షేర్‌ఖాన్‌ పాత్రను స్క్రిప్ట్‌ దశలోనే తొలగించిందట చిత్ర బృందం.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని