
తాజా వార్తలు
ఫెంటాస్టిక్ ఫోర్‌తో మెగాస్టార్ చిరు
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరుమీదున్నారు. రీఎంట్రీ తర్వాత యువ కథానాయకులకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తాను పనిచేస్తున్న దర్శకులతో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మెహర్ రమేశ్, మెహన్ రాజా, కొరటాల శివ, బాబీలతో చిరంజీవి సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే.
‘‘నా నలుగురు కెప్టెన్లు. ఈ నలుగురూ ఫెంటాస్టిక్ 4, చార్ కాదమ్’’-ట్విటర్లో చిరంజీవి
ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత మలయాళ సూపర్‌హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం చిత్ర బృందం నటీనటుల ఎంపికలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ‘వేదాళం’ రీమేక్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరంజీవి.