
తాజా వార్తలు
బాధ్యతల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా విధుల నుంచి తప్పుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులుకు ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్కూ బదిలీ అయింది. ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ దినేశ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. రేపు ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌రెడ్డిని జీఏడీకి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు బాధ్యలు అప్పగించారు.
గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో 9 మంది అధికారులు అలసత్వం వహించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ లేఖ రాశారు. దాని ప్రకారం చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లు, తిరపతి అర్బన్ ఎస్పీపై చర్యలు తీసుకున్నారు.
ఇవీ చదవండి..
సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయి: రైతు సంఘాలు