దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు

విజయవాడ: తిరుపతిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మార్ఫింగ్‌ వీడియో ప్రదర్శించారనే ఆరోపణల కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబసభ్యులు సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

విచారణకు హాజరుకావాలని దర్యాప్తు బృందం ఇప్పటికే దేవినేని ఉమాకు రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. మొదటిసారి పది రోజుల సమయం కావాలని ఆయన కోరారు. తర్వాత ఈనెల 19న విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు గొళ్లపూడిలోని నివాసానికి నోటీసు అంటించారు. రెండోసారి కూడా దేవినేని విచారణకు హాజరుకాలేదు. దీంతో సీఐడీ అధికారులు ఇవాళ నేరుగా దేవినేని ఇంటికి వెళ్లారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌కు సంబంధించిన ఓ వీడియోను మీడియా ముందు దేవినేని ప్రదర్శించారు. అయితే వీడియోను మార్ఫింగ్‌ చేసి చూపించారంటూ నారాయణరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవినేనిపై ఈనెల 10న సీఐడీ కేసు నమోదు చేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని