శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
close

తాజా వార్తలు

Updated : 11/01/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటుడు మోహన్‌బాబు, మంచు విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. నటి కీర్తి సురేశ్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటులకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నటులను చూసిన యాత్రికులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. 

ఈ సందర్భంగా ప్రజలకు మోహన్‌ బాబు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం లాంటి రోజులు ఎన్నడూ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అదేవిధంగా తాను నటించిన ‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతోందని మోహన్‌బాబు వెల్లడించారు. 

ఇవీ చదవండి..
జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

తొమ్మిది రాష్ట్రాలకు పాకిన బర్డ్‌ఫ్లూ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని