
తాజా వార్తలు
వైకాపా నాయకుల బాహాబాహీ!
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్ననపేటలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రైతుభరోసా కేంద్రం నిర్మాణానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేసి వెళ్లిపోయిన అనంతరం పార్టీలోని ఇరువర్గాల నాయకులూ దుస్తులు చిరిగేలా కొట్టుకున్నారు. పలువురు నాయకులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సొంతపార్టీలో ఉన్నవాళ్లే ఇలా కొట్టుకోవడంపై పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలు మనసులో పెట్టుకొనే వీధిపోరాటానికి దిగినట్లు భావిస్తున్నారు.
Tags :