close

తాజా వార్తలు

Updated : 21/01/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో?లేదో?: భట్టి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సంక్షేమం, సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతున్నామని చెప్పే రాష్ట్ర మంత్రులు.. ప్రజా సమస్యలను పక్కనపెట్టారని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్‌ సీఎం అవుతారంటూ వ్యాఖ్యలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో? లేదో? తెలియడంలేదని అసహనం వ్యక్తం చేశారు.  సమస్యలు పరిష్కరిస్తారనే ప్రజలు నాయకులను ఎన్నుకున్నారని.. ప్రజా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆక్షేపించారు. సచివాలయం లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం తెరాస అని.. మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదన్నారు. ప్రభుత్వ పాలనను చూసి రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

సంజయ్‌.. చేతల్లో చూపించండి!

‘‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలకు అంతే లేకుండా పోతుంది. ఎప్పుడు మాట్లాడినా అవినీతిపరులపై కేసులు పెడతామని అంటారు. ఇంతవరకు ఆయన ఎవరిమీదా కేసు పెట్టింది లేదు. మాటలు తప్పా బండి సంజయ్‌ ఇప్పటివరకు ఏం చేయలేదు. ఆయన మాటల్లో నిజం ఉంటే చెప్పేది చేతల్లో చూపించాలి. రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయి. విజిలెన్స్‌, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. వాటి ద్వారా రాష్ట్రంలోని అవినీతిపరులపై దర్యాప్తు జరిపించండి. ఆ దర్యాప్తు ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో మొదలుపెట్టండి. రూ.28 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో అవినీతి జరిగిందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? రీడిజైనింగ్‌ ఎందుకు చేశారు? అలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?అనే అంశాలపై విచారణ జరిపించండి’’ అని సంజయ్‌ను ఉద్దేశించి భట్టి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి..

‘కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు’

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?: తలసాని



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని