‘నేతల కొనుగోలు తెరాసకు పరిపాటిగా మారింది’
close

తాజా వార్తలు

Published : 14/04/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నేతల కొనుగోలు తెరాసకు పరిపాటిగా మారింది’

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.   జానారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీ మారుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. ఇది భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల లబ్ధి పొందారని విమర్శించారు.

సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ ఉన్నత విలువలు, ఆదర్శప్రాయమైన రాజకీయాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి జానారెడ్డి అని భట్టి కొనియాడారు. అలాంటి వ్యక్తిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత చౌకబారుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి గురించి తెలిసిన ఏ ఒక్కరూ బండి సంజయ్ మాటలను విశ్వసించరని తెలిపారు. తెరాస వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేసేందుకు అధికార తెరాసతో కలిసి భాజపా ఆడుతున్న నాటకమని ప్రజలు గుర్తించారన్నారు. సాగర్‌ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార పార్టీకి ఎన్నికలు వ్యాపారంలా మారిపోయాయని.. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడకు  వెళ్లి నేతలను కొనుగోలు చేయడం పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని