వరద ప్రాంతాల్లో ఉచిత రేషన్‌: సీఎం జగన్‌
close

తాజా వార్తలు

Published : 20/10/2020 01:05 IST

వరద ప్రాంతాల్లో ఉచిత రేషన్‌: సీఎం జగన్‌

అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై అంచనాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తే రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే వరద ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఉచిత రేషన్‌ అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు సుచరిత, కొడాలి నాని ఉన్నారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని